"దైవ సన్నిధి సంతోషము" - నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు" కీర్తనలు 16:11 - Father.Mungamuri Devadasu Ayyagaru upadeshamu
దైవ సన్నిధి సంతోషము “ జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు " కీర్తనలు 16:11. ప్రియులారా ! ఈవేళ ఆదివారము ఆరాధన దినము , ప్రత్యేక ఆదివారము . ప్రభువుయొక్క పునరుత్థానమును జ్ఞాపకము చేసికొనవలెను . ఈస్టరు పండుగనాడేకాదు ప్రతిదినము మనకు పునరుత్థానము అవసరము . గుడిలో జరిగేది ఆరాధన . ఇక్కడ ఆరాధన కొరకు ప్రత్యేకించుకొన్నాము గనుక ఈ స్థలము కూడ దేవాలయము వంటిదే . మనము ఇప్పుడు దేవాలయములో ఆరాధనకు కూడుకొనియున్నాము అని జ్ఞాపకము ఉంచుకొనండి . ఈరోజు నా ప్రసంగవాక్యము కీర్తనలు 16:11 “ జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు " అనేదైయున్నది . బైబిలంతటిలో ' దైవసన్నిధి ' అనేమాట కనబడుచున్నది . ఎక్కడ ఆ మాట కనబడునో అక్కడ సన్నిధియొక్క ఉనికి కనబడును . ఈ అంశమును రెండు భాగములు చేయుచున్నాను . 1) దేవుడు తన సన్నిధిని నరులకు అనుగ్రహించుట , 2) నరులే దేవుని సన్నిధికి వచ్చుట . ఈ రెండు భాగములలో ఏది ముఖ్యము ? దేనికదే ప్రాముఖ్యము . దైవసన్నిధి మన దగ్గరకు రాకపోతే , మ...